Publicworks ఇంజనీరు అరెస్టు

ABN , First Publish Date - 2021-12-02T16:58:49+05:30 IST

భారీగా రూ.2.21 కోట్ల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్న కేసులో వేలూరు ప్రజాపనుల శాఖ మహిళా ఇంజనీర్‌ శోభనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన శోభన

Publicworks ఇంజనీరు అరెస్టు

                    - రూ.2.27 కోట్లు స్వాధీనం


వేలూరు(చెన్నై): భారీగా రూ.2.21 కోట్ల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్న కేసులో వేలూరు ప్రజాపనుల శాఖ మహిళా ఇంజనీర్‌ శోభనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన శోభన (57) వేలూరు ప్రజాపనుల శాఖ మండల సాంకేతిక విద్యా కార్యాలయంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వేలూరు, తిరుపత్తూర్‌, రాణి పేట, కడలూరు, ధర్మపురి, తిరువణ్ణామలై తదితర ఆరు జిల్లాలు ఈ కార్యాలయ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో పాలిటెక్నిక్‌ కళాశాలల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల పర్యవేక్షణకు వెళ్లిన ఇంజనీర్‌ భారీగా లంచాలు ఆశిస్తున్నట్లు, దీపావళి సందర్భంగా మామూళ్లకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులం దాయి. దీంతో, వేలూరు ఏసీబీ డీఎస్పీ కృష్ణన్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు రజనీకాంత్‌, విజయలక్ష్మి, విజయ సహా 12 మంది అధికారుల బృందం గత నెల 3, 4 తేదీల్లో వేలూరులోని సదరు ఇంజనీర్‌ కార్యాలయం, హోసూరులోని ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుకాగా, ఆమెపై శాఖా పరమైన విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇంజనీర్‌ శోభన్‌ తిరుచ్చికి బదిలీ అయ్యారు. ఏసీబీ సిఫారసు పట్టించుకోకుండా, శాఖాపరమైన విచారణ చేపట్టకుండా, ఆమెను సస్పెండ్‌ చేయకుండా ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారులు ఆమెను తిరుచ్చికి బదిలీ చేయడంపై విమర్శలు తలెత్తాయి. ఈ క్రమంలో, మంగళవారం సాయంత్రం అవినీతి నిరోధక విభాగం అధికారులు శోభనను మళ్లీ విచారించారు. విచారణలో తగిన ఆధారాలు లభించడంతో రాత్రి 7 గంటల సమయంలో ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన ఏసీబీ అధికారులు వేలూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వేలూరు జైలుకు తరలించారు. 

Updated Date - 2021-12-02T16:58:49+05:30 IST