పుదీనా - పచ్చిబఠాణీ సూప్‌

ABN , First Publish Date - 2020-08-01T19:03:33+05:30 IST

వెదర్‌ కూల్‌గా ఉన్నప్పుడు వేడి వేడి సూప్‌ తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుంది. కరోనా భయం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో

పుదీనా - పచ్చిబఠాణీ సూప్‌

శక్తి వైపు సూపులు!

వెదర్‌ కూల్‌గా ఉన్నప్పుడు వేడి వేడి సూప్‌ తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుంది. కరోనా భయం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కూడా సూప్స్‌ ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని సూప్స్‌ ఇవి. మరి మీరూ ట్రై చేయండి.


కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - తగినంత, పచ్చి బఠాణీ - నాలుగు కప్పులు, వెజిటబుల్‌ స్టాక్‌ - నాలుగు కప్పులు, పుదీనా - ఒక కట్ట, లేత పాలకూర - ఒక కప్పు, మిరియాల పొడి - అర టీస్పూన్‌. 


తయారీ : స్టవ్‌పై పాత్ర పెట్టి ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె బాగా వేడి అయ్యాక పుదీనా, పాలకూర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి. పదినిమిషాల తరువాత పచ్చి బఠాణీ, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి కలియబెట్టాలి. మూత పెట్టి మరో పది నిమిషాల పాటు ఉడికించి దింపాలి. మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకుని కొద్దిగా ఆలివ్‌ అయిల్‌, మిరియాల పొడి చల్లాలి. పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి. ఈ సూప్‌ రుచిగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని ఇస్తుంది.

Updated Date - 2020-08-01T19:03:33+05:30 IST