పూడిక తీస్తే ఫలితం

ABN , First Publish Date - 2020-02-07T13:39:46+05:30 IST

డిసెంబరు 31వ తేదీ.. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరా నికి స్వాగతం పలికే రోజు.. ఆ రోజు అందరూ ఆనం దంలో కేక్‌లు కట్‌ చేసుకుంటండగా ..

పూడిక తీస్తే ఫలితం

సరళాసాగర్‌లో పేరుకుపోయిన ఒండ్రు మట్టి

కట్ట తెగి 40 రోజులైనా పట్టించుకోని వైనం

టెండర్లు ఖరారు కాకుండానే పనులు


డిసెంబరు 31వ తేదీ.. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరా నికి స్వాగతం పలికే రోజు.. ఆ రోజు అందరూ ఆనం దంలో కేక్‌లు కట్‌ చేసుకుంటండగా మదనాపురం మం డల వాసులు మాత్రం విషాదంలో ఉండిపోయారు.  కారణం ఆరోజు సరళాసాగర్‌ ప్రాజెక్టు కట్ట తెగిపోవడ మే. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉన్నందున రైతులు రబీలో వరి సాగుకుసన్నద్ధమయ్యారు. కట్ట తెగి పోయిన నేపథ్యంలో మంత్రి నిరంజన్‌రెడ్డి కేఎల్‌ఐ ద్వారా ఎడమ కాలువ ఆయకట్టుకు నీరందిస్తామని చెప్పినా ఎగువ నుంచి నీరు రాకపోవడంతో బీడు భూములుగా మిగిలాయి. కట్ట తెగి 40 రోజులు కావస్తున్నా ప్రాజెక్టు మరమ్మతుకు సంబంధించిన డిజైన్‌, టెండర్లు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజె క్టులో నీరు ఉన్నందున మిషన్‌ కాకతీయలో పూర్తి స్థా యి ఒండ్రును అధికారులు తీయలేకపోయారు. 70 సం వత్సరాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులో పేరుకు పోయిన ఒండ్రు చాలా సారవంతమైనది. దానిని పొలాలకు తరలిస్తే దిగుబడి అధికంగా వస్తుంది. ప్రస్తుతం సరళా సాగర్‌ ప్రాజెక్టు ఎండిపోయినందున సిల్ట్‌ను పూర్తి స్థాయిలో తరలిస్తే అటు రైతులకు లాభం చేకూరడ మే కాక నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇసుక లేదే..:

కట్ట తెగిపోయిన రోజు మంత్రి మాట్లాడుతూ ఇసుక ను తరలించే ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెప్పడం తో ఇసుక మాఫియాలో ఆశలు రేకెత్తాయి. కానీ మైనిం గ్‌, రెవెన్యూ అధికారులు సర్వే చేయగా ప్రాజెక్టు అడుగు భాగంలో ఏమాత్రం ఇసుక లేదని, ఒండ్రు మాత్రమే ఉందని చెప్పడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.


ఖరీఫ్‌కైనా సిద్ధమయ్యేనా!

ప్రాజెక్టు పనులు ఇంత వరకు మొదలు పెట్టకపోవ డంతో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక పంట కోల్పోయిన వారు కనీసం వానాకాలానికైనా మరమ్మతు పనులు పూర్తి చేస్తే ఖరీఫ్‌లోనైనా పంటలు వేసుకుంటామంటున్నారు. లేకపోతే గతంలో మాదిరిగా బతకడానికి వలసలు పోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


టెండర్‌ కాకుండానే పనులు ప్రారంభం..

ప్రాజెక్టు మరమ్మత్తకు సంబంధించిన డిజైన్‌, టెండర్‌ ప్రక్రియ పూర్తి కాకుండానే పనులు మొదలు పెట్టడం విస్మయానికి గురి చేస్తోంది. డి జైనింగ్‌ ఏవిధంగా ఉంటుందో రైతులకు చెప్పాల్సిన అవసర ముంది. ఇవేమి పట్టించుకోకుం డా అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి పనులు ప్రారం భించారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. పనులు నాణ్యవం తంగా చేపట్టి ఖరీఫ్‌కు సాగు నీరందించాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-02-07T13:39:46+05:30 IST