లలితా పీఠంలో సంకటహర చతుర్ధి పూజలు

ABN , First Publish Date - 2021-10-25T04:46:32+05:30 IST

స్థానిక లక్ష్మీ హయగ్రీవ లలితా పీఠంలో ఆదివారం సంకటహర చతుర్ధి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు.

లలితా పీఠంలో సంకటహర చతుర్ధి పూజలు
లలితా పీఠంలో రోహిణి వ్రతం నిర్వహిస్తున్న భక్తులు

కామవరపుకోట, అక్టోబరు 24 స్థానిక లక్ష్మీ హయగ్రీవ లలితా పీఠంలో ఆదివారం సంకటహర చతుర్ధి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా రోహిణి వ్రతాలు నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకులు సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు భక్తులతో పూజలు చేయించారు. రిజిస్ట్రార్‌ ఆఫీసు సమీపంలో 42 అడుగుల గణనా ఽథుని సన్నిధిలో సంకటహర చతుర్ధి పూజలను భక్తులు నిర్వహించారు. జీలకర్రగూడెం, కళ్ళచెరువు, తడికలపూడి, ఆడమిల్లి, రావికంపాడు, రామన్న పాలెం, తూర్పుయడవల్లి, తదితర గ్రామాల్లో భక్తులు సంకటహర చతుర్ధి పూజలు విఘ్నేశ్వరస్వామి ఉప ఆలయాల వద్ద నిర్వహించారు.

Updated Date - 2021-10-25T04:46:32+05:30 IST