Farmers Protest పై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2021-07-17T00:58:09+05:30 IST

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్నందున రైతు ఆందోళనపై సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలని కెప్టెన్ కోరారు.

Farmers Protest పై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: రైతు ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్రవారం లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించాలని ప్రధానికి రాసిన లేఖలో ఆయన కోరారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్నందున రైతు ఆందోళనపై సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలని కెప్టెన్ కోరారు.


‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ లేఖ రాశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ సమయంలోనే రైతులతో ప్రభుత్వం చర్చలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రధానిని కోరారు. అంతే కాకుండా అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కూడా ప్రధానికి కెప్టెన్ పలు సూచనలు చేశారు’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

Updated Date - 2021-07-17T00:58:09+05:30 IST