పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

ABN , First Publish Date - 2021-07-16T14:20:02+05:30 IST

పులిచింతల ప్రాజెక్టుకు వదర ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం

పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వదర ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 41.28 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు  నీటిమట్టం 172.09 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 22,396 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో నిల్‌గా ఉంది. ఈ నెల 13న అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పాదనను అధికారులు నిలిపివేశారు. ఎగువ మూసి, వరద కాలువల నుండి భారీగా పులిచింతలకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. పులిచింతల విద్యుత్ కేంద్రం వద్ద 20 మంది స్థానిక పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-16T14:20:02+05:30 IST