Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..2 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-01T13:47:12+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్‎కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల పూర్తి స్థాయి

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..2 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్‎కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 42.817 టీఎంసీలుగా కొనసాగుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం : 175అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 173.06 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 38,701క్యూసెక్కులు ఉంది. విద్యుత్ ఉత్పాదన కోసం 13,200 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. నాలుగు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-01T13:47:12+05:30 IST