Guntur: విరిగిపోయిన పులిచింతల డ్యామ్ గేట్

ABN , First Publish Date - 2021-08-05T13:56:48+05:30 IST

రద ఉధృతికి పులిచింతల ప్రాజెక్టులోని ప్రమాదవశాత్తు 16వ నంబరు క్రస్ట్ గేట్ గేటు విరిగిపోయింది. 2 లక్షల క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతున్నట్లు

Guntur: విరిగిపోయిన పులిచింతల డ్యామ్ గేట్

గుంటూరు: వరద ఉధృతికి పులిచింతల ప్రాజెక్టులోని ప్రమాదవశాత్తు 16వ నంబరు క్రస్ట్ గేట్ గేటు విరిగిపోయింది. 2 లక్షల క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో వెంటనే అధికారులు 16వ గేటు సహా 11,13,14,18,19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పులిచింతల ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 44.53 టీఎంసీలుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 174.14 అడుగులు ఉంది.

Updated Date - 2021-08-05T13:56:48+05:30 IST