Abn logo
Sep 24 2021 @ 08:56AM

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ ఐదుగేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్ ఫ్లో 60,548 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 60,638 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 3.2.50 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 165.68 అడుగులుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption