suryapet: నిండుకుండలా పులిచింతల ప్రాజెక్ట్

ABN , First Publish Date - 2021-07-17T15:17:38+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.

suryapet: నిండుకుండలా పులిచింతల ప్రాజెక్ట్

సూర్యాపేట: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 43.15 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 173.29 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 14,130 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో నిల్‌గా ఉంది. 

Updated Date - 2021-07-17T15:17:38+05:30 IST