పులివెందుల కాలేజీకే ప్రత్యేకమా?

ABN , First Publish Date - 2021-09-15T08:31:09+05:30 IST

ఎయిడెడ్‌ కళాశాలల్లోని లెక్చరర్లను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ఆగమేఘాల మీద దాదాపుగా పూర్తిచేసిన ప్రభుత్వం...

పులివెందుల కాలేజీకే ప్రత్యేకమా?

లయోలా ఎయిడెడ్‌ సిబ్బంది విలీనం నిలుపుదల

అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ కళాశాలల్లోని లెక్చరర్లను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ఆగమేఘాల మీద దాదాపుగా పూర్తిచేసిన ప్రభుత్వం...పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల విషయంలో మాత్రం భిన్న వైఖరిని తీసుకుంది. ఈ కళాశాలలోని ఎయిడెడ్‌ లెక్చరర్లను కూడా ప్రభుత్వంలోకి తీసుకోవడం ద్వారా...ఇక ఆ కళాశాలలో ఎయిడెడ్‌ లెక్చరర్లు లేకుండా చేస్తూ ఆగస్టు 27వ తేదీన ఉత్తర్వులిచ్చింది. ఆ కళాశాలలోని లెక్చరర్లను తక్షణం జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద రిపోర్టు చేసి విలీనం కావాలంది. అయితే తాజాగా ఆ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి మేరకు ఎయిడెడ్‌ లెక్చరర్లు, సిబ్బంది అక్కడే ఉండేందుకు అంగీకారం తెలిపింది. ఆ లెక్చరర్లను ప్రభుత్వంలోకి తీసుకోవద్దంటూ సంబంఽధిత అధికారులను ఆదేశిస్తూ కాలేజీ విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ మెమో జారీచేశారు. ఈ మినహాయింపు పులివెందులలోని కళాశాలకేనా...మిగతా వాటన్నింటికీ వర్తింపచేస్తారా...అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-09-15T08:31:09+05:30 IST