Abn logo
Oct 29 2020 @ 17:57PM

పునర్నవికి కాబోయే భర్త ఇతనేనా?.. ఫొటో వైరల్‌

Kaakateeya

హీరోయిన్‌, బిగ్‌బాస్3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం సినిమాల ద్వారా కంటే.. బిగ్‌ బాస్‌ ద్వారానే బాగా పాపులర్‌ అయ్యింది. అందులో బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో ఆమె వ్యవహరించిన తీరు హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. బిగ్‌ బాస్‌ నుంచి బయటికి వచ్చాక వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. ఆమె వేరొకరితో ప్రేమలో ఉందని రాహుల్‌ చెప్పినా ఎవరూ వినలేదు. ఇక తాజాగా పునర్నవి మ్యారేజ్‌ పై క్లారిటీ వచ్చేసింది. బుధవారం ఆమె నిశ్చితార్థపు ఉంగరం ఫొటోని చూపిస్తూ.. 'ఫైనల్లీ ఇట్స్‌ హ్యాపెనింగ్‌' అని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


నిశ్చితార్థపు ఉంగరం ఉన్న తన చేతిని వేరే చేయి పట్టుకుని ఉండటంతో.. ఆమెని పెళ్లి చేసుకోబోయే వారు ఎవరా? అని అంతా అనుకుంటుండగా.. ఆ సస్పెన్స్‌కు తెరదించింది పునర్నవి. తను పెళ్లి చేసుకోబోయే వాడి ఫొటోని బ్లర్‌గా ప్రజంట్‌ చేసి అత‌ని పేరు ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ అని.. మా గురించి మొత్తం మీకు రేపు తెలియజేస్తానని పునర్నవి పేర్కొంది. ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ కూడా ఫైనల్లీ ఆమె అంగీకరించింది. రేపు (శుక్రవారం) మా జీవితంలో చాలా గొప్పరోజు అని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.. అని ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయడమే కాకుండా.. పునర్నవితో కలిసి ఉన్న ఫొటోని కూడా షేర్‌ చేశారు. ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్  విషయానికి వస్తే.. అత‌ను నటుడే కాదు.. రైట‌ర్, ఫిలిం మేక‌ర్ అని కూడా తెలుస్తుంది. వీరి వివాహం శుక్రవారం జరగనుందని.. అందుకే ఇద్దరూ శుక్రవారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. వీరిద్దరూ కలిసి నటించిన ఓ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ కోసం.. ఈ విధంగా ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారని.. పునర్నవి, ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ పెళ్లి విషయంలో చెబుతున్నది వాస్తవం కాదని, పునర్నవి చేతికి ఉన్న రింగ్‌ కూడా కుడిచేతికి ఉందని.. కాబట్టి ఇది పెళ్లి మ్యాటర్‌ కాదని, ప్రమోషన్‌ మ్యాటర్‌ అని అనే వారు కూడా లేకపోలేదు. మరి ఏ విషయం తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్‌ చేయక తప్పదు. 



Advertisement
Advertisement