థాకరే సర్కారుపై షా సెటైర్లు

ABN , First Publish Date - 2021-12-20T02:59:15+05:30 IST

పూణె: మహారాష్ట్రలోని అఘాడీ సర్కారుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు.

థాకరే సర్కారుపై షా సెటైర్లు

పూణె: మహారాష్ట్రలోని అఘాడీ సర్కారుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. అఘాడీ సర్కారు మూడు టైర్ల ఆటో రిక్షాలాంటిదని మూడు టైర్లూ మూడు దిశల్లో ఉన్నాయన్నారు. అన్ని టైర్లకూ పంక్చర్ కూడా అయిందని దీనివల్ల ఉన్న దగ్గర్నుంచి కదలడం లేదని ఎద్దేవా చేశారు. కదలకుండా పొగమాత్రమే వదులుతూ కాలుష్యం వెదజల్లుతోందని షా వ్యంగ్యోక్తులు విసిరారు. పూణేలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 



Updated Date - 2021-12-20T02:59:15+05:30 IST