డాక్టరుకు కరోనా.. 3 నెలల్లో రెండోసారి..!

ABN , First Publish Date - 2020-09-27T02:06:15+05:30 IST

ముడూ నెలల వ్యవధిలో ఓ డాక్టరు రెండు మార్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్‌గా సేవలందిస్తున్న ఆయన జున్ 12న తొలిసారిగా కరోనా సోకినట్టు వెల్లడైంది.

డాక్టరుకు కరోనా.. 3 నెలల్లో రెండోసారి..!

పూణె: ముడూ నెలల వ్యవధిలో ఓ డాక్టరు రెండు మార్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్‌గా సేవలందిస్తున్న ఆయన జున్ 12న తొలిసారిగా కరోనా సోకినట్టు వెల్లడైంది. ఆయన త్వరగానే కోలుకోవడంతో వైద్యులు జూన్ 22న ఆయన్ను డిశార్జ్ చేశారు. ఆ సందర్భంగా రెండు మార్లు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్ అని వచ్చింది. కచ్చితమైన ఫలితాలు అందించే టెస్టుగా పేరుపడ్డ ఆర్‌టీ-పీసీఆర్ ద్వారా వైద్యులు ఆయన కరోనానుంచి పూర్తిగా కోలుకున్నారని నిర్ధారించారు. 


ఆ తరువాత సదరు డాక్టరు యథాప్రకారం విధుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఇటీవల ఆయనకు ఒళ్లు నెప్పులుగా అనిపించడంతో వైద్యులు ఆయనకు యాంటీజెన్ కరోనా పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన మరోసారి కరోనాతో ఇబ్బంది పడుతున్నట్టు వెల్లడైంది. కాగా.. వైరస్ జన్యుక్రమాన్ని తెలుసుకునే నిమిత్తం వైద్యులు ఆయన బ్లడ్ శాంపిల్స్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఒకసారి నెగెటివ్ అని వచ్చాక మళ్లీ పాజిటివ్ అని వచ్చిందంటే ఇది కరోనా రీఇన్ఫెక్షన్‌గా భావించాలని అక్కడి డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-27T02:06:15+05:30 IST