బతుకులు చీకటిపాలు

ABN , First Publish Date - 2020-06-02T09:03:30+05:30 IST

రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిస్తే మా బతుకులను చీకటిలోకి నెడుతున్నారంటూ అమరావతి

బతుకులు చీకటిపాలు

రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చినందుకు శిక్ష 

167వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతుల ఆవేదన


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, మే 1: రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిస్తే మా బతుకులను చీకటిలోకి నెడుతున్నారంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం 167వ రోజు ఆందోళనలు కొనసాగించారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, వెలగపూడి, దొండపాడు, మల్కాపురం, తదితర రాజధాని 29 గ్రామాల్లో రైతులు, కూలీలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అనేక పథకాల పేరుతో అడగని వారికి కూడా బ్యాంకు ఖాతాల్లో డబ్బులేస్తున్న ప్రభుత్వం... అమరావతి రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత ఏడాది కూడా ఆందోళన చేస్తేనే చెల్లించాలరన్నారు.


తమపైౖ ఎందుకీ వివక్ష అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాలలో చేపట్టిన నిరసనలు సోమవారం నాటికి 41వ రోజుకు చేరుకున్నాయి.  

Updated Date - 2020-06-02T09:03:30+05:30 IST