రూ.590 కోట్ల రుణాలను మాఫీ చేసిన పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2021-07-14T22:26:59+05:30 IST

పంజాబ్ ప్రభుత్వ 'రుణ మాఫీ పథకం' కింద సేద్యం మీద ఆధారపడిన కూలీలు, కౌలు రైతులకు..

రూ.590 కోట్ల రుణాలను మాఫీ చేసిన పంజాబ్ సీఎం

ఛండీగఢ్: పంజాబ్ ప్రభుత్వ 'రుణ మాఫీ పథకం' కింద సేద్యం మీద ఆధారపడిన కూలీలు, కౌలు రైతులకు రూ.590 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారంనాడు ప్రకటించారు. ప్రైమరీ అగ్నికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులైన 2,85,325 మందికి రూ.590 కోట్ల మేర పంజాబ్ ప్రభుత్వం రుణ చెల్లింపులు జరుపుతుందని చెప్పారు. ఆగస్టు 20న జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో చెక్కులు జారీ చేస్తారు.


కాగా, పంజాబ్ కాంగ్రెస్ 2017లో ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేసిన 'రుణ మాఫీ పథకం' కింద ఇంతవరకూ 5.64 లక్షల మంది రైతులకు రూ.4.624 కోట్ల మేరకు రుణాలు మాఫీ చేసినట్టు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి అదనంగా ఎస్‌సీ, బీసీ కేటగిరీల కింద రుణాలను ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున మాఫీ చేసినట్టు చెప్పారు. తాజాగా, రైతు కూలీలు, కౌలు రైతుల రుణ మాఫీ పథకం కింద రూ.590 కోట్ల రుణాలను రద్దు చేయాలని గత మంగళవారంనాడు జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్, కార్పొరేషన్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంథ్వా, అదనపు కార్యదర్శి (వ్యవసాయం) అనురుథ్ తివారీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-14T22:26:59+05:30 IST