Abn logo
Sep 27 2021 @ 08:25AM

అనూహ్య పరిణామం.. సడన్‌గా కారును ఆపేయమన్న ముఖ్యమంత్రి.. పెళ్లి వేడుక వద్దకు వెళ్లి మరీ వధూవరులకు షాకిచ్చారు..!

బతిండా(పంజాబ్): అందరూ పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు.. అలాంటి సమయంలో అక్కడ ఓ కారు ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగడం చూసి పెళ్లికొడుకు, పెళ్లి కూతురితో పాటు కుటుంబసభ్యులు కూడా సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వ్యక్తి మామూలు సాదాసీదా మనిషి కాదు. ఆయన ఓ రాష్ట్రానికే అధినేత. ఈ అనూహ్య పరిణామం వల్ల వధూవరుల ఆనందం మరింత రెట్టింపు అయ్యిందనడంలో సందేహం లేదు.. అసలు విషయంలోకి వెళ్తే..


పంజాబ్‌లోని బతిండా జిల్లా మంది కలాన్ గ్రామంలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. అందరూ పెళ్లి సంబరాల్లో బిజీబిజీగా ఉన్నారు. అలాంటి వేడుకలో ఉన్న వారందరినీ ఓ వ్యక్తి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంతకు ఆయన ఎవరంటే.. ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీ. ఆదివారం బతిండా నగరంలో అధికారిక పర్యటనకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆయనకు మంది కలాన్ గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకను చూసి డ్రైవర్‌ను కారు ఆపమన్నారు. వెళ్లి వేడుక దగ్గర సీఎంను చూసి వధూవరులతో పాటు కుటుంబసభ్యులూ ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటి వరకు ఎవరికీ ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆనందపడ్డారు. సీఎం చన్నీ వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి ఎప్పుడు జరిగిందని కుటుంబ సభ్యులను అడగగా.. శనివారం జరిగిందని చెప్పారు. ఈ వీడియోను పంజాబ్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లి వేడకను సీఎం చన్నీ మరింత రెట్టింపు చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


ప్రత్యేకంమరిన్ని...