లఖింపూర్ ఘటన: అమిత్ షాను కలిసిన పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2021-10-06T00:57:00+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం రైతులను పొట్టన పెట్టుకున్న దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కలుసుకున్నారు. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాంఖ ముఖ్య కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది..

లఖింపూర్ ఘటన: అమిత్ షాను కలిసిన పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం రైతులను పొట్టన పెట్టుకున్న దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కలుసుకున్నారు. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాంఖ ముఖ్య కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది. లఖింపూర్ ఘటనతో పాటు మూడు సాగు చట్టాలపై కూడా అమిత్ షాతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం.


‘‘లఖింపూర్‌ లాంటి ప్రమాదాలు మరిన్ని జరగక ముందే మూడు వ్యవసాయ చట్టాలను వీలైనంత తొందరలో ఉపసంహరించుకోవాలి. ఇదే విషయమై నేను ఈరోజు అమిత్ షాను కలిసి మాట్లాడతాను’’ అని చండీగఢ్ నుంచి బయలుదేరే ముందు మీడియాతో సీఎం చన్నీ అన్నారు. వాస్తవానికి చన్నీ సోమవారం లఖింపూర్‌కి వద్దామనుకున్నారు. కానీ ఆయనకు అనుమతి లభించలేదు. అనంతరం మరునాడే కేంద్ర హోంమంత్రితో సమావేశం కావడం గమనార్హం. కాగా, కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నా చన్నీ.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రధానిని డిమాండ్ చేసినట్లు చెప్పారు.

Updated Date - 2021-10-06T00:57:00+05:30 IST