పంజాబ్ కాంగ్రెస్‌లో ముదురుతున్న సంక్షోభం.. సీఎంపై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2021-05-18T02:18:54+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. పంజాబ్ మాజీ మంత్రి అయిన నవజోత్ సింగ్ సిద్దూ ఇప్పటికే ముఖ్యమంత్రి

పంజాబ్ కాంగ్రెస్‌లో ముదురుతున్న సంక్షోభం.. సీఎంపై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. పంజాబ్ మాజీ మంత్రి అయిన నవజోత్ సింగ్ సిద్దూ ఇప్పటికే ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన సహచరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజకీయ కార్యదర్శి కెప్టెన్ సందీప్ సంధు నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందుకు చర్యలు తప్పవని, తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం మాటగా చెబుతూ తనను హెచ్చరించారని పేర్కొన్నారు.  


ఆయన మాటలు విని తాను షాక్‌కు గురయ్యానని పర్గత్ పేర్కొన్నారు. శాక్రిలెజ్, పోలీస్ ఫైరింగ్ కేసుల గురించి నిజం మాట్లాడడం వారికి నచ్చడం లేదని అన్నారు. వారు ఏం కావాలంటే అది చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. శాక్రిలెజ్, పోలీస్ ఫైరింగ్ కేసులకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో పర్గత్ కూడా పాల్గొన్నారు. అయితే, పర్గత్ ఆరోపణలపై ఇటు కెప్టెన్ సందీప్ సంధు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఇంత వరకు స్పందించలేదు.     


Updated Date - 2021-05-18T02:18:54+05:30 IST