ఇక‌పై మాస్కుల స్థానంలో ఆక్సిజెనో.... ఎంత ఉప‌యుక్త‌మంటే...

ABN , First Publish Date - 2020-05-31T16:40:31+05:30 IST

క‌రోనా వ్యాప్తి నిరోధానికి మాస్కులు ధరించడం వల్ల ప‌లువురికి శ్వాస సంబంధిత స‌మస్య‌లు త‌లెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీకి చెందిన...

ఇక‌పై మాస్కుల స్థానంలో ఆక్సిజెనో.... ఎంత ఉప‌యుక్త‌మంటే...

అమృత్‌స‌ర్‌: క‌రోనా వ్యాప్తి నిరోధానికి మాస్కులు ధరించడం వల్ల ప‌లువురికి శ్వాస సంబంధిత స‌మస్య‌లు త‌లెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తొలిసారిగా బహుళప్ర‌యోజ‌న‌క‌ర‌ ఆల్గే ఆధారిత రెస్పిరేటర్ ఆక్సిజెనోను అభివృద్ధి చేశారు. ఇది గాలిలో ఉన్న 99.3 శాతం హానికర వాయువులను, కణ పదార్థాలను తటస్థం చేయడమే కాకుండా, శ‌రీరానికి అందే ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ పరిశోధనా బృందంలో దీపక్ దేబ్, అనంత్ కుమార్ రాజ్‌పుత్, మనీష్ కోట్ని, విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ సమ్యూల్ ఉన్నారు. దీపక్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఇప్పటికే అందుబాటులో ఉన్న‌ఉన్న ఎన్-95 లేదా శస్త్రచికిత్స మాస్కులు కాలుష్య కారకాలను, సూక్ష్మజీవులను ఫిల్టర్ చేస్తాయి. అయితే ఇవి కాలుష్య కారకాలైన‌ కార్బన్ డయాక్సైడ్, నత్రజని, సల్ఫర్ డయాక్సైడ్, కార్బోనామోనాక్సైడ్ త‌దిత‌ర వాయువులను ఫిల్టర్ చేయవ‌ని తెలిపారు. అయితే ఆక్సిజెనో నాలుగు పొరల సహాయంతో 10 మైక్రోమీటర్ల నుండి 0.44 మైక్రోమీటర్ల వరకు కణాలను ఫిల్టర్ చేయగలదు. దీని హెపా ఫిల్టర్ దుమ్ము కణాలను ఫిల్టర్ చేస్తుంది, ఉత్తేజిత కార్బన్ ఫిల్టర్లు వాసనలు, హానికరమైన కాలుష్య వాయువులను  ఫిల్టర్ చేస్తుంది ఈ ఆక్సిజెనో ఉబ్బసం రోగులకు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడేవారికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-31T16:40:31+05:30 IST