Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 19 2021 @ 19:02PM

పంజాబ్ మొదటి దళిత సీఎంగా చన్నీ రికార్డ్!

చండీగఢ్: పంజాబ్‌కు నూతన సీఎంగా ఎంపికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ కొత్త రికార్డ్ సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ.. ఆ ప్రక్రియ పూర్తైతే పంజాబ్‌ తొట్టతొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతికెక్కుతారు. ఇప్పటి వరకు పంజాబ్‌కు 15 మంది ముఖ్యమంత్రులు పని చేశారు. పంజాబ్‌కు 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చన్నీ రాష్ట్రానికి మొదటి దళిత సీఎం కాబోతుండడం గమనార్హం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కేబినెట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఛంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


రాజకీయంగా చన్నీపై ఎలాంటి మరకలు లేకపోవడంతో అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక పోతే రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన శిరోమణి అకాలీ దళ్, బహుజన్ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా ఒక కారణం. సిక్కు వర్గంలో దళితుల ఓటు శాతం ఎక్కువ. శిరోమణి అకాలీ దళ్ పార్టీకి ఇది కలిసి వస్తుందనే ఊహాగానాలు అనేకం ఉన్నాయి. తాజా ఎంపికలో ఇది కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
Advertisement