ఇక‌పై పెళ్లిళ్ల‌కు 50 కాదు... 30 మందే...కొత్త నిబంధ‌న‌లు అమ‌లు!

ABN , First Publish Date - 2020-07-14T13:43:25+05:30 IST

పంజాబ్‌లో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని, అక్క‌డి అమరీందర్ సింగ్ ప్రభుత్వం రాష్ట్రంలో బహిరంగ సభల‌ను పూర్తిగా నిషేధించింది. అలాగే సామూహిక కార్య‌క్ర‌మాల‌కు ఐదుగురు...

ఇక‌పై పెళ్లిళ్ల‌కు 50 కాదు... 30 మందే...కొత్త నిబంధ‌న‌లు అమ‌లు!

చండీగఢ్: పంజాబ్‌లో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని, అక్క‌డి అమరీందర్ సింగ్ ప్రభుత్వం రాష్ట్రంలో బహిరంగ సభల‌ను పూర్తిగా నిషేధించింది. అలాగే సామూహిక కార్య‌క్ర‌మాల‌కు ఐదుగురు, పెళ్లిళ్ల‌కు 30 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తినిచ్చారు. గతంలో వివాహాల‌కు 50 మంది వ‌ర‌కూ హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఉండేది. ఇప్పుడు దీనిని మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌నున్నారు. పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న‌దాని ప్ర‌కారం ఎవ‌రైనాస‌రే సామాజిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించే ముందు పోలీసులు, ప‌రిపాల‌నాధికారుల‌ను త‌ప్ప‌నిస‌రిగా సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు. అలాగే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిరిగేట‌ప్పుడు ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు  ధ‌రించ‌డంతో పాటు సామాజిక దూరం పాటించాల‌ని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-07-14T13:43:25+05:30 IST