పెండింగులో ఉన్న water, power బిల్లుల మాఫీ

ABN , First Publish Date - 2021-10-19T17:51:44+05:30 IST

కీలకమైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ ఛన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల తాయిలాలు ప్రకటించింది...

పెండింగులో ఉన్న water, power బిల్లుల మాఫీ

పంజాబ్ కాంగ్రెస్ సర్కారు ఎన్నికల తాయిలం

చండీగఢ్: కీలకమైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ ఛన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల తాయిలాలు ప్రకటించింది.పంజాబ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఛార్జీలు, గ్రామాల్లో గ్రామీణ మంచినీటి సరఫరా పథకాల పెండింగ్ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది.ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ ఛన్నీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంపై రూ .1,800 కోట్ల ఆర్థిక భారం మోపే నిర్ణయం తీసుకున్నారు.‘‘మేం అన్ని నగరాల్లో 700 కోట్ల రూపాయల నీటి బిల్లు బకాయిలను మాఫీ చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి ఛన్నీ ఇక్కడ కేబినెట్ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


మంచి నీటి సరఫరా,మురుగునీటి ఛార్జీల బకాయిలన్నింటినీ మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సర్కారు జారీ చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.గ్రామీణ మంచినీటి సరఫరా పథకాల బకాయిలు రూ .1,168 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలను తీర్చడానికి బడ్జెట్ నిధులను అందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో సర్కారు పేర్కొంది.అక్టోబర్ 1 నుంచి అన్ని గ్రామీణ నీటి సరఫరా పథకాలకు ఉచిత విద్యుత్ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ. 440 కోట్ల వార్షిక వ్యయం పడనుంది. మున్సిపాలిటీలు,నగర పంచాయితీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో 125 చదరపు గజాల కంటే ఎక్కువ ప్లాట్ సైజు ఉన్న అన్ని వర్గాల గృహ కనెక్షన్‌ల కోసం నీటి వినియోగ ఛార్జీలను నెలకు రూ .50 కి తగ్గించాలని మంత్రివర్గం నిర్ణయించింది.పట్టణ ప్రాంతాల్లో 125 చదరపు గజాల వరకు ఉన్న ప్లాట్‌లకు ఇప్పటికే నీరు, మురుగునీటి వినియోగదారుల ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు.


Updated Date - 2021-10-19T17:51:44+05:30 IST