మావాడికి ఫోర్లకంటే సిక్సర్లే ఇష్టం.. యువ ఆల్‌రౌండర్‌ వీడియోపై పంజాబ్ కింగ్స్ పోస్ట్

ABN , First Publish Date - 2021-04-09T04:15:03+05:30 IST

టీమిండియా మాజీ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ కోచ్ కుంబ్లే.. అతడిని హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్‌తో పోల్చాడు. ఇక పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని ఏరి కోరి రూ.5 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే షారూఖ్ ఖాన్‌పై అందరి దృష్టీ నెలకొంది. 25 ఏళ్ల షారుక్‌ దేశవాళీ క్రికెట్‌లో..

మావాడికి ఫోర్లకంటే సిక్సర్లే ఇష్టం.. యువ ఆల్‌రౌండర్‌ వీడియోపై పంజాబ్ కింగ్స్ పోస్ట్

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ కోచ్ కుంబ్లే.. అతడిని హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్‌తో పోల్చాడు. ఇక పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని ఏరి కోరి రూ.5 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. అతడే చెన్నై యువ క్రికెటర్.. షారూఖ్ ఖాన్‌. ఈ క్రమంలోనే అందరి దృష్టీ ఈ కుర్రాడిపై నెలకొంది. 25 ఏళ్ల షారుక్‌ దేశవాళీ క్రికెట్‌లో పెద్ద స్కోర్లేమీ చేయకపోయినప్పటికీ, అలవోకగా సిక్సర్లు బాదగల సామర్ధ్యం ఉండడం వల్లనే అతడిని పంజాబ్ ఫ్రాంచైజీ అంద ధర పెట్టి దక్కించుకుంది. ఐపీఎల్‌లో అదరగొట్టాలని ఉవ్విళూరుతున్న ఈ చెన్నై కుర్రాడు.. అందుకు తగ్గట్టుగానే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. పేసర్‌, స్పిన్నర్‌ అన్న తేడా లేకుండా ఎడాపెడా భారీ సిక్సర్లు బాదుతున్నారు. ఫోర్లు కూడా కొట్టొచ్చనే విషయమే మర్చిపోయినట్లు కేవలం సిక్సర్లపైనే ఫోకస్ చేశాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా షారుక్‌ బాదిన సిక్సర్లకు సబంధించిన వీడియోను పంజాబ్‌ తన ట్విటర్లో పోస్ట్‌ చేసింది.


‘నయా సిక్స్‌ హిట్టింగ్‌ మెషీన్‌‌ షారుక్ ఖాన్. ఫోర్లు కొట్టడం కన్నా సిక్సర్లు బాదేందుకే ఇష్టపడతాడు. ఇది ట్రైలర్‌ మాత్రమే.. పూర్తి సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి’  అంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌ జోడించింది. కాగా.. కేఎల్ రాహుల్​ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్​లో తమ తొలి మ్యాచ్​ను ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్​తో ఆడనుంది.

Updated Date - 2021-04-09T04:15:03+05:30 IST