Abn logo
Sep 26 2021 @ 00:20AM

సెకండ్ షెడ్యూల్‌లో పంజాబ్ బోణీ

ఐపీఎల్ 2021లో భాగంగా షార్జాలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఉత్కంఠ విజయం సాధించింది. విజయం ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ బొక్క బోర్లా పడింది. కేవలం 125 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. చివర్లో జేసన్ హోల్డర్(47 నాటౌట్: 29 బంతుల్లో 5 సిక్స్‌లతో పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహ(31) తర్వాత ఒక్కరు కూడా క్రీజులో నిలవలేదు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 120 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో విజయం దక్కించుకున్న పంజాబ్ సెకండ్ షెడ్యూల్‌లో తొలి విజయం నమోదు చేసింది. అలాగే పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు, మహ్మద్ షమి 2 వికెట్లతో రాణించగా అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ ఓటమిపాలైనా ఆ జట్టు తరపున బౌలింగ్‌లో 3/19, బ్యాటింగ్‌లో 47 ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన హోల్డర్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.