Abn logo
Sep 28 2021 @ 19:51PM

సిద్ధూకి మద్దతుగా పంజాబ్‌లో రాజీనామాలు

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, సిద్ధూకి మద్దతుగా పంజాబ్‌లో రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజీనామా చేశారు. అందులో ఒకరు చన్నీ క్యాబినెట్ మంత్రి కాగా, మరొకరు పంజాబ్ కాంగ్రెస్ కమిటీ ట్రెజరర్. సిద్ధూకు బేషరతు మద్దతు తెలుపుతూ తాను రాజీనామా చేస్తున్నట్లు మంత్రి రజియా సుల్తానా ప్రకటించారు. మంగళవారం సిద్ధూ రాజీనామా చేసిన కొద్ది సమయానికే తన రాజీనామాను ప్రకటించారు.


ఇక పార్టీ టెర్రజరర్ గుల్జర్ ఇందర్ కూడా సిద్ధూకు మద్దతుగా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపిన ఆయన.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే వీరెవరూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కేవలం పార్టీలో ఉన్న పదవులకు మాత్రమే రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి వదులుకుంటున్నట్లు ప్రకటించిన సిద్ధూ పార్టీ కోసం పని చేస్తానని రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం.