బెంగళూరుపై పంజాబ్ ఉత్కంఠ విజయం

ABN , First Publish Date - 2020-10-16T04:53:45+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన ...

బెంగళూరుపై పంజాబ్ ఉత్కంఠ విజయం

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‎లో 8 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని పంజాబ్ సొంతం చేసుకుంది. 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు కెప్టెన్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు.రాహుల్  (43 బంతుల్లో 61 ఒక ఫోర్, ఐదు సిక్సులతో నాటౌట్)‎గా నిలవగా.. అగర్వాల్ (25 బంతుల్లో45,  నాలుగు ఫోర్లు, 3 సిక్సర్ల)తో విరుచుకుపడ్డారు. అగర్వాల్ ఔట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ బెంగళూరు తనదైన శైలిలో బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. అయితే..చివర్లో బెంగళూరు మంచి లైన్ అండ్ లెన్త్ బౌలింగ్ చేసి పరుగులు రాకుండా కట్టడి చేసింది.


దీంతో మ్యాచ్ చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అనే సందేహం ఏర్పడింది. ఇదే క్రమంలో చివరి బంతికి ఒక్క పరుగు చేసే క్రమంలో గేల్ (45 బంతుల్లో  ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 53) రన్స్ చేసి..సింగిల్ తీసే క్రమంలో రనౌట్‎గా వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. తర్వాత క్రీజులోకి వచ్చిన  నికోలస్ పూరన్ చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ విన్నింగ్ షాట్‎తో ముగించాడు.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‎కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‎లో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (18), మరో ఓపెనర్ ఫించ్(20) కూడా మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 48 పరుగులు చేసి ఆడుతుండగా షమీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రాహుల్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన వాషింగ్టన్ సుందర్ 13, శివమ్ దూబే 23 పరుగులు వెంటవెంటనే ఔట్ అయ్యారు. బౌలర్లపై సిక్స్‌లతో విరుచుకుపడే డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే షమీ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. క్రిస్ మోరిస్ 25, ఉదన 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

Updated Date - 2020-10-16T04:53:45+05:30 IST