లైసెన్స‌ ఉన్న డీలర్ల వద్దనే ఎర్రజొన్న విత్తనాలు కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-09-25T06:47:25+05:30 IST

రైతులు ఎర్రజొన్న విత్తనా లు ఏ డీలర్‌ వద్ద కొనుగోలు చేస్తారో ఆ డీలర్లే తిరిగి ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని కలెక్టర్‌

లైసెన్స‌ ఉన్న డీలర్ల వద్దనే ఎర్రజొన్న విత్తనాలు కొనుగోలు చేయాలి

కలెక్టర్‌ నారాయణ రెడ్డి

రైతులు, డీలర్లతో సెల్‌ కాన్ఫరెన్స


నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 24 : రైతులు ఎర్రజొన్న విత్తనా లు ఏ డీలర్‌ వద్ద కొనుగోలు చేస్తారో ఆ డీలర్లే తిరిగి ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. గురువారం సం బంధిత అధికారులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మా ట్లాడారు. ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజ కవర్గాల్లోన్ని 18 మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగవుతోందన్నారు. లైసెన్స్‌ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి అగ్రిమెంట్‌ ద్వారా ఆ డీలరే తిరిగి పంటను కొనుగోలు చేయా లన్నారు. లైసెన్స్‌ లేని డీలర్ల వద్ద విత్తనాలు తీసుకోకూడదని సూచిం చారు. ఈ విషయమై శుక్రవారం నుంచి తహసీల్దార్లు, ఏవోలు గ్రామాల్లో అవగాహన కల్పిస్తారని తెలిపారు. 

Updated Date - 2020-09-25T06:47:25+05:30 IST