ఈదురు గాలులతో వర్షం

ABN , First Publish Date - 2020-05-10T10:41:18+05:30 IST

జిల్లాలో శనివారం సా యంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసిం ది. దీంతో వరిధాన్యం తడిసిపోగా, మామిడి నేల రాలింది.

ఈదురు గాలులతో వర్షం

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

నేలరాలిన మామాడి కాయలు

పలుచోట్ల లేచిపోయిన పైకప్పు రేకులు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాలో శనివారం సా యంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసిం ది. దీంతో వరిధాన్యం తడిసిపోగా, మామిడి నేల రాలింది. జగిత్యాల బాలాజీ థియేటర్‌ సమీపంలో ఓ భవనంపై హోర్డింగ్‌ వైర్లపై పడిపోయింది.  జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడ, నర్సింగాపూర్‌, తిప్పన్నపేట, దరూర్‌,హస్నాబాద్‌, అంబారీపేట తదితర గ్రామాల్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మెట్‌పల్లి పట్టణంలో శనివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం కలిగింది.


కోరుట్ల మండలంలోని చిన్న మెట్‌పల్లి, మోహన్‌రావుపేట, గుమ్లాపూర్‌, వెంక టాపూర్‌, కోరుట్లలో కురిసన వర్షంతో వరి ధాన్యం తడిచి ముద్దయింది. మాదాపూర్‌ గ్రామ శివారు లోని విఘ్నేశ్వర రైస్‌ మిల్లు షెడ్డు కూలిపోయి ధాన్యం తడిసిపోయింది. మేడిపల్లి మండలం పోరుమల్ల ప్రాథమిక పాఠశాల రేకులు లేచిపోయి రోడ్డుపై పడ్డాయి. మేడిపల్లి జాతీయ రహదారిపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు రాలిపోయాయి. వెల్గటూర్‌ మండలంలోని కొత్తపేట, అంబా రిపేట, సంకెనపెల్లి, చెర్లపెల్లి, జగదేవ్‌పేట కొను గోలు కేంద్రాలలో నీరు చేరి ధాన్యం తడిచించి. నిలి చిన నీటిని తొలగించడానికి రైతులు అవస్థలు ప డ్డారు. ఎంపీపీ కూనమల్ల లక్ష్మి చెర్లపెల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. చెర్లపెల్లిలో ఆదె మల్ల య్య ఇంటి రేకులు లేచి పోగా, మ్యాకల వెంకయ్య, మ్యాకల రవి గోడలు కూలి పోయాయి.


రాయికల్‌ మండలం ఒడ్డెలింగాపూర్‌, వస్తాపూర్‌, కట్కా పూర్‌, రాయికల్‌, రామాజీపేట, కుమ్మరిపెల్లి, అల్లీపూర్‌ తదితర గ్రామాల్లో శనివారం సాయం త్రం కురిసిన వడగళ్ల వర్షానికి కొనుగోలు కేంద్రాల లో ధాన్యం తడవగా, మామిడి నేలరాలింది.  రా యికల్‌లో తాటి చెట్టు కూలిపోయింది.బుగ్గారం  మండలంలోని వివిధ గ్రామాల్లో వర్షంతో కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడిచిం ది. ధాన్యం తడువకుండా రైతులు కవర్లు కప్పినప్ప టికీ గాలిదుమారానికి లేచిపోయాయి. బుగ్గారం జెడ్పీటీసీ రాజేందర్‌ తడిచినధాన్యం పరిశీలించారు.  ధర్మపురి మండలంలోని పెద్దనక్కలపేట, కమలాపూర్‌, రామయ్యపల్లె, నాగారాం, తిమ్మాపూర్‌, రాయపట్నం తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది.


రామయ్యపల్లె, బూరుగుపల్లె జాతీయ రహదారిపై చెట్టు విరిగి పడిపోయింది. పెద్దనక్కలపేట చెట్లు విరిగి రెండు గొర్రెలు మృతి చెందాయి. మామిడి నేల రాలింది.గొల్లపల్లి మండలంలో ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోయిం ది. పలు గ్రామాల్లో ధాన్యం నేలరాలింది. 

Updated Date - 2020-05-10T10:41:18+05:30 IST