‘నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి’

ABN , First Publish Date - 2020-07-14T11:09:01+05:30 IST

సీసీ కెమెరాల కొనుగోళ్లలో గత పాలకవర్గం అక్రమాలకు పాల్పడినట్లు కుప్పం ప్రాథమిక వ్యవసాయ పరపతి ..

‘నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి’

మదనపల్లె, జూలై 13: సీసీ కెమెరాల కొనుగోళ్లలో గత పాలకవర్గం అక్రమాలకు పాల్పడినట్లు కుప్పం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో) త్రిసభ్య కమిటీ ఆరోపించింది. నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ విచారణ జరపాలని సీఈవోకు రెండురోజుల కిందట బాధ్యతలు అప్పగించింది. టీడీపీ హయాంలో డీసీసీబీ మంజూరు చేసిన రూ.కోటి రుణాన్ని గత పాలకవర్గం కుప్పం పంచాయతీ వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఖర్చు చేసింది. రుణం మంజూరు చేయడానికి అటు డీసీసీబీకి, ఈ నిధులను ఖర్చు చేయడానికి ఇటు పాలకవర్గానికి అర్హత లేదని త్రిమెన్‌ కమిటీ పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక అందినా జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. 

Updated Date - 2020-07-14T11:09:01+05:30 IST