Abn logo
Sep 19 2021 @ 01:22AM

పేట మార్కెట్‌లో పెసల కొనుగోళ్లు

క్వింటాకు రూ.5వేల నుంచి రూ.6,900 పలికిన ధర 

సూర్యాపేట సిటీ, సెప్టెంబరు 18: సూర్యాపేట మార్కెట్‌కు పెసలు రాక ప్రారంభమైంది. పెసర సీజన్‌ మొదలుకావడంతో సూర్యాపేట పరిసర ప్రాంతాల నుంచి సూర్యాపేట మార్కెట్‌కు రైతులు పెసలను తీసుకొస్తున్నారు. సూర్యాపేట పరసర ప్రాంతాలైన పెన్‌పహాడ్‌,చివ్వెంల, నూతన్‌కల్‌, ఆత్మకూర్‌(ఎస్‌) మండలాలతోపాటు కోదాడ నియోవర్గంలోని మో తె మండలంలోని నామవరం, మోతె, మామిళ్లగూడెం నుంచి సూర్యాపేట మార్కెట్‌కు పెస లు వస్తున్నాయి. సెప్టెంబరు రెండోవారం నుంచి మార్కెట్‌కు భారీగా పెసలు రావడం ప్రారరంభమైందని మార్కెట్‌ అధికారులు తెలియజేస్తున్నారు. సెప్టెంబరు 13 నుంచి మార్కెట్‌కు భారీగా పెసలు రావడం ప్రారంభమైందని మార్కెట్‌ అధికారులు తెలిపారు. మార్కెట్‌లో పెసరకు క్వింటాకు రూ.5,000 నుంచి రూ.6,900 వరకూ ధర వస్తుండటంతో రైతులు మా ర్కెట్‌కు పెసలు తీసుకురావడానికి మొగ్గుచూపుతున్నారు. సెప్టెంబరు 13న పేట మార్కెట్‌కు 248బస్తాల పెసలు రాగా, వాటికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,825, కనిష్ఠంగా రూ.3,259 పలి కింది. 14నమార్కెట్‌కు 288 బస్తాలురాగా, వాటికి గరిష్ఠంగా రూ.6,501, కనిష్ఠంగా రూ.3,069, 15న136 బస్తాలు రాగా, గరిష్ఠ ధర రూ.6,919, కనిష్ఠంగా రూ.3,366 ధర పలికింది. 16న మార్కెట్‌కు 165 బస్తాలు రాగా వాటికి కనిష్ఠంగా రూ.6,779, కనిష్ఠంగా రూ.2,727గా ధర పలికింది. శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు 326 బస్తాల పెసలు రాగా, వాటి కి గరిష్ఠంగా రూ.6,831, కనిష్ఠంగా రూ.3,636గా ఖరీదుదారులు ధరలను కేటాయించారు.


రైతులను మోసం చేస్తున్న వ్యాపారులు 

మార్కెట్‌కు పెసల తాకిడి పెరుగు తుండడంతో మార్కెట్‌లో రైతులను మోసం చేయడానికి కమీషన్‌దారులు, ఖరీదుదారులు రెడీ అవుతున్నారు. రైతులు తెచ్చిన పెసలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, తేమశాతం ఎక్కువగా ఉన్నాయని, రంగుమారినంటూ సాకులు చూపి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


తక్కువ ధరలు వస్తే దృష్టికి తేవాలి : ఎండీ ఫసియొద్దీన్‌, సూర్యాపేట మార్కెట్‌ కార్యదర్శి.

మార్కెట్‌కు వస్తున్న రైతులు ధరల విషయంలో ఏమైనా సమస్యలుంటే దృష్టికి తేవాలి. ఆన్‌లైన్‌ టెండర్‌ ద్వారా ధరలను నిర్ణయించడంవల్ల తక్కువ ధర వచ్చే అవకాశం లేదు. కమీషన్‌దారులు, ఖరీదుదారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటాం.