కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-27T07:13:54+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాగు కోసం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వేల్పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం పచ్చలనడ్కుడ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అంకన్నగారి రాజారెడ్డితో కలిసి ఎఎంసీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
పచ్చలనడ్కుడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏఎంసీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి

వేల్పూర్‌, అక్టోబరు 26: రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాగు కోసం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వేల్పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం పచ్చలనడ్కుడ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అంకన్నగారి రాజారెడ్డితో కలిసి ఎఎంసీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రాలకు తాలు లేకుండా ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం వరిధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వం మద్దతు ధర రూ.1960 పొందలన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ రాజన్న, వైస్‌చైర్మన్‌ గుడాల గంగాధర్‌, సొసైటీ పరిధిలో సర్పంచ్‌లు శ్వేత గం గారెడ్డి, సౌడ రమేష్‌, నితిష్‌కుమార్‌, సుధాకర్‌గౌడ్‌, మహేష్‌, ఎంపీటీసీలు గుడాల గంగాధర్‌, నోముల గంగారెడ్డి, సౌడ చందన్‌, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు బైరి రవి, సొసైటీ కార్యదర్శి స్వామి, తదితరులు పాల్గొన్నారు. 

సిరికొండ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ మంగళవారం ప్రారంభించారు. మండలంలోని సరిపల్లి తండా, పెద్ద వాల్గొట్‌, కొండూరు, తదితర గ్రామాల్లో సిరికొండ సహకార సంఘం ఐకేపీ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.  

ధర్పల్లి: మండలంలోని సీతాయిపేట్‌, గుడితండా, ఒన్నాజీపేట్‌, నడిమితండా, ఇందిరానగర్‌ కాలనీల్లో ఐకేపీ, సింగిల్‌విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్‌, ఎంపీపీ సారికారెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు రాజ్‌పాల్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, సర్పంచ్‌లు రాములు, ఏపీఎం సునీత, తదితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: మండలంలోని దూసుగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గద్దె భూమన్న ప్రారంభించగా ఘన్‌పూర్‌, సుద్దులం గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను విండో చైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు.  

జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రహ్మణ్‌పల్లి గ్రామంలో సింగిల్‌విండో ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మంగళవారం ఎంపీపీ దికొండ హరిత, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.  

ముప్కాల్‌: మండలంలోని రెంజర్ల సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని మంగళ వారం వైస్‌ఎంపీపీ ఆకుల రాజన్నతో కలిసి సొసైటీ చైర్మన్‌ కోమటిశెట్టి గంగాధర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రా నికి తేమ 17  శాతం మించకుండా రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఏ గ్రేడ్‌ రకం క్వింటాలుకు రూ.1960, బి గ్రేడ్‌ రకానికి రూ.1940గా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

నవీపేట: మండలంలోని నాగేపూర్‌లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు.  అలాగే, మండలంలోని తుంగినిలో కొనుగోలు కేంద్రాన్ని బినోల సోసైటీ చైర్మన్‌ హన్మాండ్లు ప్రారంభించారు.  

కోటగిరి: రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్‌, పొతంగల్‌ విండో అధ్యక్షుడు శాంతేశ్వర్‌ పటేల్‌ సూచించారు. మండలంలోని పొతంగల్‌ విశాల పరపతి సంఘం ఆవరణలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని మోసపోవద్దని సూచించారు. నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. 

ఎడపల్లి: మండలంలోని అంబం(వై) గ్రామంలో బోధన్‌ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం బోధన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వాగ్మారే అర్చన సూర్యకాంత్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, స్థానిక సర్పంచ్‌ పిస్క గంగాప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు దేశాయ్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అంబం(వై) గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు కృషి చేసిన చైర్మన్లు, గ్రామ సర్పంచ్‌లతో పాటు సొసైటీ డైరెక్టర్‌లకు వ్యవసాయ అధికారులకు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ లక్ష్మణ్‌, బోధన్‌ ఏఎంసీ కార్యదర్శి పుర్యానాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు షకీల్‌, రైతులు, తదితరులున్నారు. 

Updated Date - 2021-10-27T07:13:54+05:30 IST