Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం

జడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌


చోడవరం, నవంబరు 27: గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం పకడ్బంధీగా అమలుకావాలని జడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరూ సమన్వయంతో స్వచ్ఛ కార్యక్రమాలు అమలు చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అవసరమైన చోట్ల చెత్త సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ గాడి కాసులమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు మారిశెట్టి విజయ, వైస్‌ ఎంపీపీ బి.గంగరాజు, ఎంపీడీవో శ్యాంసుందర్‌, ఈవోపీఆర్డీ చైతన్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కనకమ్మ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement