Abn logo
Sep 19 2020 @ 09:20AM

మీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్

Kaakateeya

మనుషులు వంద ఫిర్యాదులు చేస్తారని, పెంపుడు జంతువులు మిమ్మల్ని ప్రేమించడం తప్ప ఎలాంటి కంప్లైంట్‌లూ చేయవని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా `పెంపుడు జంతువులు` గురించి మాట్లాడారు. 


`నా చిన్నప్పడు మా అమ్మానాన్న మా ఇంట్లో పెరిగిన గేదెను సంతలో అమ్మేశారు. వారం రోజుల తర్వాత అది పదిహేను ఊళ్లు దాటి మా ఇంటికి వచ్చేసింది. మమ్మల్ని చూసి అది కన్నీళ్లు పెట్టుకుంది. మా అమ్మానాన్న దానిని చూసి ఏడ్చేశారు. మేం ఆ గేదెను డబ్బు కోసం అమ్మేశాం. ఎవరో దానిని ఎత్తుకుపోయారనుకుంది. తప్పించుకుని తన ఫ్యామిలీ కోసం వచ్చేసింది. అవి అంత ఎమోషనల్‌గా ఫీలవుతాయి. పెంపుడు జంతువుల వల్ల మనం చాలా నేర్చుకుంటాం. ఏదో ఒక పెంపుడు జంతువును పెంచుకోండి. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే తప్పనిసరిగా ఓ కుక్కను పెంచుకోండి. ఐదేళ్ల మీ పాప దానికి తల్లిగా మారుతుంది. మనుషులను పెంచుకుంటే వంద ఫిర్యాదులు చేస్తారు. పెంపుడు జంతువులకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు. మీ దగ్గర డబ్బు లేకపోతే అందరూ వదిలేస్తారేమో. కానీ, మీరు రోడ్డు మీదకు వచ్చేసి అడుక్కుంటున్నా మీ పక్కన కూర్చునేది మీ కుక్కే` అని పూరీ పేర్కొన్నారు. Advertisement
Advertisement