Abn logo
Sep 29 2020 @ 17:04PM

మోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్

Kaakateeya

కొందరికి జీవితంలో అనవసరంగా భారీ గుర్తింపు వచ్చేస్తుందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన తరచుగా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా `మోనాలిసా` గురించి మాట్లాడారు. 


`మోనాలిసా పేరు తెలియని ఊరు ఉండదు. అందాన్ని వర్ణించాలంటే అందరూ మోనాలిసా పేరును వాడతారు. మోనాలిసా పెయింటింగ్ చూడడానికి పారిస్‌లోని లోరే మ్యూజియమ్‌కు వెళ్లాను. అక్కడ అద్భుతమైన శిల్పాలున్నాయి. మొదటిసారి మోనాలిసా చూశాను. చిన్నప్పటి నుంచి ఆ పెయింటింగ్ గురించి ఎంతో విన్నా. ఇదేనా మోనాలిసా అనిపించింది. మొత్తం నీరు కారిపోయాను. ఆ మ్యూజియం చూడడానికి వచ్చిన అమ్మాయిలందరి కంటే ఆ పెయింటింగే ఛండాలంగా ఉంది. జీవితంలో కొంత మందికి వచ్చిన పాపులారిటీ కూడా ఇంతే. వారికి అంత గుర్తింపు ఎందుకు వచ్చిందో వారికే తెలీదు. పాపులారిటీ వచ్చిన కవికి అందని భావాన్ని కూడా మనం ఊహించేస్తామ`ని పూరీ పేర్కొన్నారు.  



Advertisement
Advertisement