Abn logo
Sep 9 2020 @ 12:10PM

బ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌

Kaakateeya

డైరెక్టర్ పూరీ జగన్నాధ్ 'పూరీ మ్యూజింగ్స్' అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా పూరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి.. తాజాగా 'బ్రేకప్‌' అనే టాపిక్ మీద వివరణ ఇచ్చారు..


"ఎవరికైనా బ్రేకప్‌ అయ్యిందని తెలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే బ్రేకప్‌ అనేది ఇద్దరికీ మంచిదే. ప్రేమ వల్ల వీక్‌ అవుతాం. బ్రేకప్‌ మనల్ని స్ట్రాంగ్‌గా మారుతాం. బ్రేకప్‌ అవగానే గట్టిగా ఏడ్చి, ఫ్రెష్‌గా స్నానం చేసి, ఓ పెగ్గేసి పడుకోండి. మళ్లీ మరుసటి రోజు ఆ పెంట క్యారీ చేయొద్దు. ఈగో ఎక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువగా ఏడుస్తారు. ఇంకా ఎక్కువ ఈగో ఉన్నవాళ్లు కోసేసుకుంటారు. రాంగ్‌ పర్సన్‌ మీద ఇంత ఇన్వెస్ట్‌ చేశాను. మన టైం అంతా దొబ్బిందనే ఏడుస్తామే తప్ప, ఆ అమ్మాయి కోసం కాదు. అదే టైమ్‌లో మన ఫ్రెండ్స్‌ ఎవరైనా మన భుజం తట్టి ఓదారుస్తుంటే ఇంకా ఏడుపొస్తుంది. సింపతీ బావుందని ఇంకా ఏడుస్తాం. బ్రేకప్‌ గురించి బాధపడొద్దు. ఎన్నీ బ్రేకప్‌లైతే అంత స్ట్రాంగ్ అవుతారు. నెక్ట్స్‌ బ్రేకప్‌కి ఇంత పెంట లేకుండా గ్రేస్‌ఫుల్‌గా విడిపోవడం నేర్చుకోండి. మా అమ్మాయి ఎవడితోనో లవ్‌లో ఉందని తెలిసి, కంగారు పడిపోయి, వాడికి వార్నింగ్‌లిచ్చి మాగ్జిమమ్‌ విడదీయడానికి ట్రై చేస్తాం. అవసరం లేదు. కాస్త టైమ్‌ ఇస్తే వాళ్లకి బ్రేకప్‌ అయిపోద్ది. వాళ్లు విడిపోవడానికి టైమ్ ఇవ్వాలి కదా!. మన హడావుడి చూసి వాళ్లు లేచిపోతారు. గుళ్లో పెళ్లి చేసుకుంటారు. ఒకరంటే ఒకరికి తెలియకపోవడం వల్లే వాళ్లు ప్రేమలో పడతారు. తెలిసిన రోజు విడిపోతారు. టైమ్ ఇవ్వండి సార్‌! నాలుగు రోజులు తిరగనివ్వండి. కొట్టుకునే టైమ్‌ ఉండాలిగా. ప్రేమించడం, దాని కోసం నిలబడే యెధవలు ఈరోజుల్లో దొరకడం చాలా కష్టం. వదిలేస్తే అన్నీ బ్రేకప్‌ కేసులే" అన్నారు పూరీ జగన్నాథ్‌.  



Advertisement
Advertisement