Abn logo
Sep 13 2020 @ 13:17PM

ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌

Kaakateeya

డైరెక్టర పూరీ జగన్నాధ్ 'పూరీ మ్యూజింగ్స్' అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా పూరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి..ఫుడ్‌(తిండి) గురించి వివరణ ఇచ్చారు...

"ఒక్క రవీంద్రనాథ్‌ తప్ప థింకర్స్‌ అందరూ పేదరికంలోనే పుట్టారని నేను పదేళ్ల వయసులో ఎక్కడో చదివానని అనుకుంటాను. ప్రతి రైటర్‌ దిగువ, మధ్య తరగతి నుండి పుట్టినవాళ్లే. పందిలా తింటే నిద్రోస్తుంది తప్ప థింకింగ్‌ పెరగదని అర్థమైంది. నాకేమో రైటర్‌ కావాలని కోరిక. దాంతో ఆరోజు నుండి ఒక ముద్ద తక్కువ తినాలని ఫిక్స్‌ అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకొంచెం తినాలనిపించినప్పుడు కంచం దగ్గర నుండి లేచిపోతాను. ఆకలి వల్లే అన్నీ తెలుస్తాయి. అన్నీ అర్థమవుతాయి. స్టే హంగ్రీ, స్టే ఫూలీష్ అని స్టీవ్‌ జాబ్‌ చెప్పిన మాట చాలా మంచిది. అదేదో ఐఫోన్‌ యాడ్‌ అని మరచిపోవద్దు. అదీ ఇదీ అన్నీ టెస్ట్‌ చేయాలనే గొడవలో బఫే మొత్తం తినేయొద్దు. ఫుడ్‌ స్పెడ్‌ ఎంతున్నా దానివైపు ఓసారి చూడండి. ఏం తినాలనే విషయాన్ని మీ బాడీ చెబుతుంది. అది చెప్పింది తింటే చాలు. మీకేమీ ఆయుర్వేదం తెలియనక్కర్లేదు. మీ పొట్టపాడైంది. అడవిలో ఉన్న ఆకుల వైపు చూడండి. ఏ ఆకు తినాలో మీ బాడీ చెబుతుంది. బాడీ చెప్పినట్లు విని ఒక ముద్ద తక్కువే తినండి. పొట్ట తగ్గుద్ది, లైఫ్‌లో అలర్ట్‌గా ఉంటాం. అందుకే ఎప్పుడూ ఆకలితోనే ఉండండి. కడుపునిండనివ్వద్దు. ఆకలి తీరితే చస్తావ్‌" అన్నారు. 




Advertisement
Advertisement