Abn logo
Sep 10 2020 @ 13:42PM

పెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్

Kaakateeya

జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దని, ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో పూరీ జగన్నాథ్ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా పెళ్లి గురించి మాట్లాడారు. 


`వివాహాలకు పోయే కాలం దగ్గరపడింది. పెళ్లి అంత మంచిదైతే ఏసు క్రీస్తు పది పెళ్లిళ్లు చేసుకునేవాడు. ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడు. ఏమైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దు. పెద్ద పెద్ద ఆలోచనలుంటే ఎవరికీ తాళి కట్టొద్దు. ప్రపంచమంతా తిరగాలి, ఏమైనా సాధించాలనే కసి, పట్టుదల మీకుంటే కాళ్లకి పారాణి మాత్రం రాసుకోవద్దు. ఎలాగూ నేను బుర్ర తక్కవ వాడినే, మా ఆవిడ పకోడీలు చేస్తే తింటా, సీరియల్ చూస్తా అని మీరు అనుకుంటుంటే.. అర్జంటుగా మీ శుభలేఖ నాకు పంపించండి. నేను వచ్చి ఆశీర్వదిస్తా. జ్ఞానులెవరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్న వారందరూ పెళ్లి కాని బాబా కాళ్ల మీదే పడతారు. పెళ్లి కాని హీరోయిన్‌కు ఉన్న ఫాలోయింగ్ పెళ్లి అయిన హీరోయిన్‌కు ఉండదు. కాబట్టి మిమ్మల్ని మీరు తాడుతో కట్టేసుకోకండ`ని పూరీ పేర్కొన్నారు. 




Advertisement
Advertisement