Abn logo
May 23 2020 @ 13:01PM

దర్శకేంద్రుడికి పూరీ రొమాంటిక్ విషెస్!

కమర్షియల్ చిత్రాలను మాత్రమే కాకుండా, భక్తిరసప్రధాన చిత్రాలను కూడా అద్భుతంగా తెరకెక్కించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ రోజు  (శనివారం) ఆయన జన్మదినోత్సవం. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ట్విటర్ ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశాడు. 


`ఈ శతాబ్దపు ఉత్తమ రొమాంటిక్ డైరెక్టర్. రాఘవేంద్రరావుగారూ.. మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం.. ఇప్పటికీ నేర్చుకుంటున్నాం. మీ ఆరోగ్యం బాగుండాలని, మీకు మరింత ఎనర్జీ రావాలని కోరుకుంటున్నా. మీతో సమయం గడపడాన్ని చాలా ఇష్టపడతా. హ్యాపీ బర్త్‌డే సర్` అని పూరీ ట్వీట్ చేశాడు.



Advertisement
Advertisement
Advertisement