పూసాయి ఎల్లమ్మ జాతర

ABN , First Publish Date - 2022-01-31T07:00:06+05:30 IST

మండలంలోని పూసాయి గ్రామంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ జాతర ఆదివారం పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం వేలాది మంది భక్తులు

పూసాయి ఎల్లమ్మ జాతర
కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగబోనాలు సమర్పించిన మహిళలు

ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్త‘జనం’ 

పోలీసుల భారీ బందోబస్తు

జైనథ్‌, జనవరి 30: మండలంలోని పూసాయి గ్రామంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ జాతర ఆదివారం పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం వేలాది మంది భక్తులు, మహిళలు తరలివచ్చి పూసాయి ఎల్లమ్మ తల్లికి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లికి ప్రజలు పాడి పంటలతో సల్లంగా చూడాలని, అలాగే మేకలు, కోళ్లను సమర్పించి నైవేద్యాలతో మొక్కులను చెల్లించుకున్నారు. ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జాతరలో నెలకొన్న వివిధ దుకాణాలలో కొనుగోలు చేయగా.. స్థానిక కోనేరులో భక్తులు స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా స్థానిక జైనథ్‌ మండల ఎస్సై బిట్ల పెర్సిస్‌ భారీ పోలీసు బందోబస్తును నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూశారు. 

Updated Date - 2022-01-31T07:00:06+05:30 IST