Abn logo
Nov 30 2020 @ 10:01AM

బ‌న్నీ నెక్ట్స్ లొకేష‌న్ అదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. ప్ర‌స్తుతం ఈ సినిమా రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడుమిల్లి అట‌వీ ప్రాంతంలో చిత్రీక‌ర‌ణ‌‌ను జ‌రుపుకుంటోంది. బ‌న్నీ అండ్ టీమ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు నెక్ట్స్ షెడ్యూల్‌ను సుకుమార్ వార‌ణాసిలో ప్లాన్ చేశాడ‌ట‌. డిసెంబ‌ర్ 18 నుండి వార‌ణాసిలో చిత్రీక‌రించ‌బోయే త‌దుప‌రి షెడ్యూల్లో ఓ సాంగ్‌ను చిత్రీక‌రించే ఆలోచ‌న‌లో సుకుమార్ ఉన్నాడ‌ట‌. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది. 

Advertisement
Advertisement
Advertisement