Pushpa: గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' అనే పాన్ ఇండియన్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 5 భాషలలో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'పుష్ప ది రైజ్ పార్ట్ 1' నుంచి వచ్చిన పోస్టర్, నాలుగు లిరికల్ వీడియో సాంగ్స్ భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. కాగా, ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్‌కు సరిగ్గా 5 రోజులు ముందు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. అంటే డిసెంబర్ 12న ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారట. ఈ ఈవెంట్‌ను ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు..గెస్టులుగా ఎవరెవరు రాబోతున్నారు తదితర విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయట. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది. 

Advertisement
Advertisement