పుష్ప అంటే ఫ్లవర్‌ కాదు... ఫైరు

ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌ నటించిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయిక. ఈనెల 17న విడుదల అవుతోంది. సోమవారం ట్రైలర్‌ వదిలారు. 150 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్‌లో...  పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ విశ్వరూపం చూపించేశారు. ఈ చిత్రంలో సునీల్‌, ఫాహద్‌ ఫాజిల్‌, రావు రమేష్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతీ పాత్రనీ ట్రైలర్‌లోనే పరిచయం చేసేశారు. ‘భూమండలంలో ఎక్కడా పెరగని చెట్టు.. మన శేషాచలం అడవుల్లో పెరుగుతాంది’ అనే డైలాగ్‌ తో ట్రైలర్‌ మొదలైంది. ‘ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది. నాకు గొడ్డలిచ్చింది. ఎవడి యుద్ధం ఆడిదే’, ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటున్నారా.. ఫైరు..’ అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్‌ దృశ్యాలు మాస్‌కి నచ్చేలా సాగాయి. మొత్తానికి అల్లు అర్జున్‌ అభిమానులకు ఈ ట్రైలర్‌ విందు భోజనం అందించింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమంత ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది. ఆ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. 


Advertisement