Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా Pushpa కలెక్షన్ల సునామీ.. ఒక్క అమెరికాలోనే..

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’మూవీ .. భారీ మొత్తంలో కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’.. హాలీవుడ్ మూవీ స్పైడర్‌ను సైతం తట్టుకుని నిలబడింది. దీంతో మూడు రోజుల్లోనే అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.11 కోట్లు) వసూలు చేసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17న విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ.173 కోట్లను రాబట్టింది. 


ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ ఓవర్సీస్ రైట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రూ.14 కోట్లకు అమ్మింది. వీటిలో కేవలం అమెరికా ద్వారానే రూ.10కోట్ల మేర వచ్చాయి. హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 389 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశాయి.
Advertisement

ఓవర్సీస్ సినిమామరిన్ని...

Advertisement