స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం `పుష్ప`. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ గత నెల 10న ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అయితే షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే అర్ధంతరంగా ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
షూటింగ్లో పాల్గొంటున్న తొమ్మిది మంది యూనిట్ సభ్యులకు కోవిడ్ లక్షణాలు కనిపించాయట. ఒకరికి సీరియస్ అయిందట. దీంతో షూటింగ్‌ను ఉన్నపళంగా నిలిపేసి చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చేసిందట. షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో క్లారిటీ లేదట.