Abn logo
Oct 27 2020 @ 12:18PM

`పుష్ప` అడవుల్లోకి వెళుతున్నాడా?

Kaakateeya

లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులూ విశ్రాంతి తీసుకున్న పుష్ప రాజ్ త్వరలో రంగంలోకి దిగబోతున్నాడు. అడవుల్లో పోరాటాలు చేయబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. 


నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందట. కేరళ, లేదా మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందట. ముందుగా యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారట. ఈ పోరాట సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో ప్రస్తుతం రిహార్సల్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించబోతున్నాడు. 

Advertisement
Advertisement