Abn logo
Nov 22 2020 @ 20:10PM

లీక్‌తో ‘పుష్ప’ టీమ్‌ అలెర్ట్.. సంచలన నిర్ణయం

Kaakateeya

రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో అల్లు అర్జున్‌ 'పుష్ప' షూటింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ సుక్కు టీమ్‌ శరవేగంగా చిత్రీకరణకు ప్లాన్‌ చేసినట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది. అయితే సినిమా లొకేషన్‌లో ఉండగానే.. లొకేషన్‌ పిక్స్‌ సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుండటంతో.. చిత్రయూనిట్‌ భయపడుతోంది. ఇటీవల బన్నీ చిత్ర లొకేషన్‌లో ఉన్న పిక్‌ లీక్‌ అవ్వడంతో.. 'పుష్ప' టీమ్‌ అలెర్ట్ అయ్యింది. అంతేకాదు.. ఈ లీక్స్‌కు బ్రేక్‌ వేసేందుకు టీమ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇకపై సెట్‌లో ఎవ్వరూ మొబైల్‌ ఫోన్‌ వాడకూడదనే ఆంక్షలను చిత్రయూనిట్‌ విధించిందట. ఇప్పటికే ఈ విధానాన్ని 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ అమలు చేస్తుంది. అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ లీక్స్‌కి బ్రేక్‌ పడింది. చిత్రయూనిట్టే.. మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోలు వదులుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ అభిమానులకు షూటింగ్‌ విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి ఇదే మాదిరి 'పుష్ప' టీమ్‌ కూడా చేస్తుందేమో చూద్దాం.

Advertisement
Advertisement