‘పుష్ప’ ట్రైలర్‌ టీజ్‌ వచ్చేసింది!

అల్లు అర్జున్‌ హీరోగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 6న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ట్రైలర్‌ రుచి ఎలా ఉండబోతుందో శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ చూపించింది. ట్రైలర్‌ టీజ్‌ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు.  26 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సినిమా థీమ్‌ను, కీలక పాత్రలను చూపించే ప్రయత్నం చేశారు. ఆ సన్నివేశాలన్నీ వీడియోలో అత్యంత వేగంగా సాగుతాయి. పుష్ప అసలు ప్రపంచం చూడాలనుకుంటే వీడియో ప్లే సెట్టింగ్స్‌లో స్పీడ్‌ను 0.25కు తగ్గించుకోవాలి. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా కథానాయిక. ఫాహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. Advertisement