Abn logo
Jul 7 2020 @ 17:30PM

`పుష్ప` ట్యూన్స్ రెడీ?

స్టార్ డైరెక్టర్ సుకుమార్, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. సుకుమార్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నింటికీ దేవియే సంగీతం అందించాడు. త్వరలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు దేవి ట్యూన్లు సిద్ధం చేశాడని తెలుస్తోంది. వీడియో కమ్యూనికేషన్ యాప్‌ల ద్వారా వీరిద్దరూ వర్చువల్ మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించారట. స్వరాల ఎంపిక పూర్తయిందట. ఈ సినిమాలో మొత్తం అయిదు పాటలు ఉంటాయట. `జిగేల్ రాణి` తరహాలో మరో మంచి ఐటెం సాంగ్ కూడా ఉంటుందట. 

Advertisement
Advertisement
Advertisement