Jun 18 2021 @ 22:45PM

అమ్మలాలో పైడి కొమ్మలాలో

‘అమ్మలాలో పైడి కొమ్మలాలో... ముద్దుల గుమ్మలాలో. సందళ్లు నింపారే పందిళ్లలో... బంగారు బొమ్మలాలో’ అంటూ మంగ్లీ పెళ్లి పాట ఆలపించారు. ‘కల్యాణం... కమనీయం. ఒకటయ్యే వేళనా... వైభోగం’ అంటూ ఆమెతో సిద్‌ శ్రీరామ్‌ శ్రుతి కలిపారు. వీళ్లిద్దరూ కలిసి పాడిన ‘కల్యాణం’ పాటను శుక్రవారం సమంత విడుదల చేశారు. ఆనంద్‌ దేవరకొండ, గీత్‌ సైని జంటగా దామోదర ప్రసాద్‌ దర్శకత్వంలో గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మిస్తున్న ‘పుష్పక విమానం’ చిత్రంలోనిదీ గీతం. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం, రామ్‌ మిరియాల సంగీతం అందించారు. త్వరలో వెండితెరపై చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. శాన్వీ మేఘన, సునీల్‌, నరేశ్‌, హర్షవర్ధన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి విజయ్‌ దేవరకొండ సమర్పకులు.